Enki paatalu - enki vanti pilla

Enki paatalu - enki vanti pilla

writer: nanduri subbarao


ఎంకివంటిపిల్ల లేదోయ్ లేదోయ్
ఎంకి నావంకింక రాదోయ్ రాదోయ్ 2
మెళ్ళో పూసలపేరు తల్లో పూవులసేరు
కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు
ఎంకివంటిపిల్ల లేదోయ్ లేదోయ్
ఎంకి నావంకింక రాదోయ్ రాదోయ్ 2

సెక్కిటసిన్నీ మచ్చ సెపితే సాలదు లచ్చ 2
వొక్కనవ్వే ఏలు వొజ్జిరవైడురాలు
ఎంకివంటిపిల్ల లేదోయ్ లేదోయ్
ఎంకి నావంకింక రాదోయ్ రాదోయ్ 2

పదముపాడిందంటే పాపాలు పోవాలా 2
కధలు సెప్పిందంటే కలకాలముండాల
ఎంకివంటిపిల్ల లేదోయ్ లేదోయ్
ఎంకి నావంకింక రాదోయ్ రాదోయ్ 2
మెళ్ళో పూసలపేరు తల్లో పూవులసేరు
కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు

రాసోరింటికైనా రంగుతెచ్చే పిల్ల..
నా సొమ్ము నా గుండే నమిలిమింగిన పిల్ల
మెళ్ళో పూసలపేరు తల్లో పూవులసేరు
కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు
ఎంకివంటిపిల్ల లేదోయ్ లేదోయ్
ఎంకి నావంకింక రాదోయ్ రాదోయ్ 2
మెళ్ళో పూసలపేరు తల్లో పూవులసేరు
కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు


Enki paatalu - enki vanti pilla

other songs from Enki paatalu

gunde gontukalona

neethone untaanu

Comments