Jeans - priya priya champodde telugu lyric

జీన్స్ - ప్రియా ప్రియా చంపొద్దే

లిరిక్ రైటర్: శివ గణేష్
మ్యూజిక్: ఆర్ రెహమాన్
సింగర్: శ్రీనివాస్

ప్రియా ప్రియా చంపొద్దే ప్రియా ప్రియా చంపొద్దే
నవ్వి నన్నే ముంచొద్దే
చెలీ కన్నులతో హృదయం కాల్చొద్దే
అయ్యో వన్నెలతో ప్రాణం తీయొద్దే
ప్రియా ప్రియా చంపొద్దే
నవ్వి నన్నే ముంచొద్దే

చెలియా నీలో నడుమును చూసా
అరెరే బ్రహ్మఎంత పిసినారి
తల పైకెత్తా కళ్ళు తిరిగిపోయే
ఆహా అతడే చమత్కారి
మెరుపుని తెచ్చి కుంచెగా మలచి
రవివర్మ గీసిన వదనమట
నూరడుగుల శిల ఆరడుగులుగా
శిల్పులు చెక్కిన రూపమట
భువిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే నీదే అందమట
అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట ఘోరమట
ప్రియా ప్రియా చంపొద్దే
నవ్వి నన్నే ముంచొద్దే

           అందమైన పువ్వా పువ్వా
           చెలి కురుల సురభి తెలిపేనా
           అందమైన నదివె నదివే
           చెలి మేనిసొగసు తెలిపేవా
           అందమైన గొలుసా గొలుసా
           కాలిసొగసు తెలిపేవా
           అందమైన మణివే మణివే
            గుండె గుబులు తెలిపేవా
            ఆ ఆ ఆ ఆ

చంద్రగోళంలో ఆక్సిజన్ నింపి అక్కడ నీకొక ఇల్లు కడతా
నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులిస్తా
మబ్బులు తెచ్చి పరుపుగా పేర్చి కోమలాంగి నిను జో కొడతా
నిద్దురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడిచేస్తా ..
పంచవన్నె చిలుక జలకాలాడగా మంచు బిందువులే సేకరిస్తా ..
దేవత  జలకాలాడిన జలమును గంగాజలముగా సేవిస్తా..
ప్రియా ప్రియా చంపొద్దే
నవ్వి నన్నే ముంచొద్దే
ప్రియా ప్రియా చంపొద్దే ప్రియా ప్రియా చంపొద్దే
నవ్వి నన్నే ముంచొద్దే
చెలీ కన్నులతో హృదయం కాల్చొద్దే
అయ్యో వన్నెలతో ప్రాణం తీయొద్దే
ప్రియా ప్రియా చంపొద్దే
నవ్వి నన్నే ముంచొద్దే
హ హ హ ఆ ఆ ఆ ఆ
jeans - priya priya champodde

oter songs from Jeans

puvullo dagunna

haira haira hairabba

Comments