Current - Atu Nuvve Itu Nuvve Song Telugu Lyrics in Telugu lipilo

Current - Atu Nuvve Itu Nuvve Song Telugu Lyrics in Telugu lipilo

లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి
సింగర్: నేహా భాసిన్
స్తరింగ్: సుశాంత్, స్నేహ ఉల్లాల్

అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటువెళ్తున్నా ఏంచేస్తున్నా ప్రతిచోటా నువ్వే
అటునువ్వే ఇటునువ్వే అలికిడి వింటే అది నువ్వే
అధరంపైనా పెదవులపైనా ప్రతిమాటా నువ్వే
అపుడో ఇపుడో ఎపుడైనా నా చిరునవ్వే నీ వలన
తెలియనిలోకం తీపిని నాకు రుచి చూపావులే
పరిచయమంతా గతమేనా గుర్తుకురానా క్షణమైనా
ఎదురుగ ఉన్న నిజమేకాని కలవైనావులే ...

రంగురూపమంటూ లేనెలేనిదీ ప్రేమ
చుట్టూ శున్యమున్నా నిన్ను చూపిస్తూ ఉంది...
దూరం దగ్గరంటూ తేడా చూడదీ ప్రేమా
నీలా చెంతచేరి నన్ను మాటాడిస్తుంది
కనుపాపలోతులో దిగిపోయి ఇంతలా
ఒక రెప్పపాటు కాలమైనా మరపురావుగా
ఎద మారుమూలలో ఒదిగున్నప్రాణమై
నువ్వు లేని నేను లేను అనిపించావుగా
                                                           Atu Nuvve Itu Nuvve, Atu Nuvve Itu Nuvve manasetu chuste atu nuvve
అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటువెళ్తున్నా ఏంచేస్తున్నా ప్రతిచోటా నువ్వే
అటునువ్వే ఇటునువ్వే అలికిడి వింటే అది నువ్వే
అధరంపైనా పెదవులపైనా ప్రతిమాటా నువ్వే

నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వయేలా ప్రేమగుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా నీతోనువు కదిలావే
ఇటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేసావే
ఏకాంతవేళలో ఏ కాంతి లేదురా
నలుసంతకూడా జాలిలేని పంతాలేంటి ఇలా
నీ తోడులేనిదే మనసుండలేదురా
నీ పేరులేని ప్రేమనైనా ఊహించేదెలా


అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటువెళ్తున్నా ఏంచేస్తున్నా ప్రతిచోటా నువ్వే
అటునువ్వే ఇటునువ్వే అలికిడి వింటే అది నువ్వే
అధరంపైనా పెదవులపైనా ప్రతిమాటా నువ్వే
Atu Nuvve Itu Nuvve Song Telugu Lyrics in Telugu lipilo

Comments

  1. Hi
    I visited your blog you have shared amazing information, i really like the information provided by you, You have done a great work. I hope you will share some more information regarding Marathi Movies. I appreciate your work.
    Thanks
    Have a Great Day

    ReplyDelete

Post a Comment