Yenta Sakkagunnave Lachimi - Rangasthalam song Telugu Lyrics in Telugu Script

Yenta Sakkagunnave Lachimi - Rangasthalam song Telugu Lyrics in Telugu Script

Movie: Rangasthalam

Starring: Ramcharan & Samantha

Song singer: Devisri Prasad

Lyric writer: Chandra bose



ఎంత సక్కగున్నావే తెలుగు లిపిలో 
ఏరుసెనగ కోసం మట్టిని తవ్వితే 
ఏకంగా తగిలిన లంకెబిందెల్లాగా 
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
సింతచెట్టు ఎక్కి సిగురు కొయ్యబొతే 
సేతికి అందిన సందమామలాగా 
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

మల్లెపూల మధ్య ముద్దబంతిలాగా 
ఎంత సక్కగున్నావే
ముతైదువ మెళ్ళో పసుపుకొమ్ములాగా 
ఎంత సక్కగున్నావే
సుక్కలసీర కట్ట్టుకున్న ఎన్నెలలాగా 
ఎంత సక్కగున్నావే



ఎంత సక్కగున్నావే తెలుగు లిపిలో 
ఏరుసెనగ కోసం మట్టిని తవ్వితే 
ఏకంగా తగిలిన లంకెబిందెల్లాగా 
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
సింతచెట్టు ఎక్కి సిగురు కొయ్యబొతే 
సేతికి అందిన సందమామలాగా 
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

రెండుకాళ్ళ సినుకువి నువ్వు 
గుండెసెర్లో దూకేసినావు 
అలల మూటలిప్పేసినావు 

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
మబ్బులేని మెరుపువు నువ్వు 
నేలమీద నడిసేసినావు 
నన్ను నింగి సేసేసినావు 

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
సెరుకుముక్క నువ్వు కిరికితింట ఉంటె 
ఎంత సక్కగున్నావే 
సెరుకుగడకే తీపిరుసి తెలిపినావే 
తిరునాళ్లలో తప్పి ఎడిసేటి బిడ్డకు 
ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా 
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

గాలి పల్లకిలో ఎంకి పాటలాగా 
ఎంకి మాటలోన తెలుగు మాటలాగ 
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
కడవ నువ్వు నడుమునబెట్టి 
కట్టమీద నువ్వు నడిసొత్తా ఉంటె 
సంద్రం నీ సంకెక్కినట్టు 
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

కట్టెలమోపు తలకెత్తుకొని 
అడుగుమీద అడుగేత్తా ఉంటె 
అడివినీకు గొడుగేత్తినట్టు 
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
బురద సెలో వరినాటు ఏత్థ ఉంటె 
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోత్తనట్టు 
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

ఎంత సక్కగున్నావే తెలుగు లిపిలో 
ఏరుసెనగ కోసం మట్టిని తవ్వితే 
ఏకంగా తగిలిన లంకెబిందెల్లాగా 
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
సింతచెట్టు ఎక్కి సిగురు కొయ్యబొతే 
సేతికి అందిన సందమామలాగా 
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

Comments

  1. I have analysised your website. Now, I must suggest you to go for buying a new domain for your successfull lyrics website. There are many advantages of choosing a custom domain over your free domain. You can visit this lyrics website collection domain list (totally free).

    Whole process of starting a lyrics website is given in the post. You are getting 1000+ domain list totally free as you have to pay more than $1000+ for this. You must must if you want to get it free list

    ReplyDelete
  2. Eumaxindia specializing in Radio Advertising like suryan fm,redfm,big92.7fm,radio city,hello106.4fm.we are provides all types of online radio advertising.

    Radio advertising Chennai

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete

Post a Comment