alikidaithe chalu - devulapalli kreishna sasthri

alikidaithe chalu - devulapalli kreishna sasthri 
అలికిడైతే చాలు ఆశతో నాకనులు
వెతికేను నలుదిశలు అతనేమో అనుకుని 2
తమ్మతావుల తోడ నెమ్మదిగా నను చేరి 2
నీలిముంగురులలో గాలిఊయలలూగా 2
వెతికేను వెతికేను నలుదిశలు అతనేమో అనుకుని 2
అలికిడైతే చాలు ఆశతో నాకనులు
వెతికేను నలుదిశలు అతనేమో అనుకుని

కనులుమూసి నేను కలత నిద్దరబోవ 2
జాజిపువ్వులమాల జాజి చెక్కిలి తాక
వెతికేను వెతికేను నలుదిశలు అతనేమో అనుకుని 2
అలికిడైతే చాలు ఆశతో నాకనులు
వెతికేను నలుదిశలు అతనేమో అనుకుని

క్రోశాలు కోయంగా తోటలోనీకిపోవ
కొంటె ముల్లోకటి నా కొంగుచివరలు లాగ
వెతికేను వెతికేను నలుదిశలు అతనేమో అనుకుని 2
అలికిడైతే చాలు ఆశతో నాకనులు
వెతికేను నలుదిశలు అతనేమో అనుకుని





 alikidaithe chalu - devulapalli kreishna sasthri తెలుగు స్క్రిప్ట్ 

Comments