maa thelugu thalliki malle pudanda - desabakthi geyam

maa thelugu thalliki malle pudanda - desabakthi geyam
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు

గలగలా గోదారి కదిలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మా పరుగులిడుతుంటేను
బంగారుపంటలే పండుతాయి
మురిపాలముత్యాలు దొరలుతాయి...
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు

అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు 2
తిక్కయ్య కలములో తియ్యందనాలు 2
నిత్యమై నిఖిలమై నిలిచిఉండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారుమోగేదాకా
నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం
జై తెలుగుతల్లి జై తెలుగుతల్లి జై తెలుగుతల్లి


maa thelugu thalliki malle pudanda - తెలుగు స్క్రిప్ట్ 

Comments