sathamaanambhavathi - mellaga therindoila

శతమానంభవతి - మెల్లగా తెల్లారిందోయిలా
పాట రచన: శ్రీమణి
మ్యూజిక్ కంపొజిషన్: మికీ j మేయర్
గానం: అనురాగ్, రమ్య బెహరా, మోహన భోజరాజు
తారాగణం: శర్వానంద్, అనుపమ 

మెల్లగా తెల్లారిందోయ్ ఎలా
వెలుతురే తెచ్చేసిందోయిలా
బోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా
చేదతో బావులలో గల గల 
చెరువులో బాతుల ఈతల కళ 
చేదుగా ఉన్నవే పనులందెవేళ  
చుట్టు పొగమంచుల్లో చుట్టాల పిలుపుల్లో 
మాటలే కలిపేస్తూ మనసారా 
మమతల్ని  పండించు అందించు హృదయంలా 
       చలిమంటలు ఆరేలా గుడిగంటలు మోగేలా 
        సుప్రభాతాలే వినవేలా 
        గువ్వలు వచ్చేవేళ నవ్వులు తెచ్చేవేళ 
        స్వాగతాలివిగో కనలేవా 


పొలమారే పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి 
కళమారే ఊరంతా ఎన్నేళ్లో  నువ్వు విడిచి 
మొదట అందని దేవునిగంట 
మొదటి బహుమతి పొందిన పాట 
రాయి లకు తహ తహ లాడిన 
పసితనమే గురుతొస్తుందా.. 
ఇంతకన్నా తీయనైన జ్ఞాపకాలే 
దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాన 
            నువ్వూగిన ఉయ్యాలా ఒంటరిగా ఉగాలా 
             నువ్వేదిగిన ఎత్తే కనపడక... 
             నువ్వాడిన దొంగాట దొంగల్లె మిగలాల 
              నిన్నెవరు వెతికే వీల్లేక 
కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే 
సవ్వడితో సంగీతం పలికించే సెలయేళ్ళే .. 
పువ్వుల చెట్టుకి ఉందో భాష.. 
అలల మెట్టుకి ఉందో భాష.. 
అర్థమవ్వని వాళ్ళే లేరె .. 
అందం మాట్టాడే భాష.. 
పలకరింపే పులకరింపై 
పిలుపునిస్తూ పరవశించడమే 
మనసుకి తెలిసిన భాష... 
మమతలు పంచే ఊరు.. 
ఏమిటి దానికి పేరు... 
పల్లెటూరేగా ఇంకెవరు... 
ప్రేమలు పుట్టిన ఊరు.. 
అనురాగానికి పేరు... 
కాదనేవాళ్లే లేరెవరు ... 

other songs from sathamaanambhavathi cinema

sathamaanambhavathi title song

nalo nenu

nilavade

Comments