suswagatham - aalayana harathilo

సుస్వాగతం - ఆలయాన హారతిలో 
లిరిక్స్: సామవేదం షణ్ముఖ శర్మ
మ్యూజిక్: sa రాజకుమార్
గానం: sp బాలసుబ్రహ్మణ్యం

suswagatham - aalayaana harathilo telugu lyrics

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదానఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందో తాపన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమగుణం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం

ఎండమావిలో ఎంత వెదికినా 
నీటి చెమ్మ దొరికేనా ... 
గుండెబావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా... 
ప్రపంచాన్నిమరిపించేలా మంత్రించే ఓ ప్రేమా 
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా ... 
ఏ జాడ తెలియని ప్రాణం 
చేస్తోంది గగన ప్రయాణం 
ఎదుట ఉంది నడిరేయన్నది ఈ సంధ్యాసమయం 
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం

సూర్యబింబమే అస్తమించనిదే 
మేలుకొని కల కోసం 
కళ్ళుమూసుకుని కలవరించెనే 
కంటిపాప పాపం 
ఆయువిచ్చి పెంచిన బంధం 
మౌనంలో మసి ఐనా 
రేయిచాటు స్వప్నం కోసం 
ఆలాపన ఆగేనా 
పొందేది ఏదైమైనా పోయింది తిరిగొచ్చేనా 
కంటిపాప కల అడిగిందని 
నిదురించెను నయనం 
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదానఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందో తాపన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమగుణం
Suswagatham - aalayana harathilo song telugu lurics

Comments