Tenela thetala maatalatho - Desabhakti geyam

Tenela thetala maatalatho - Desabhakti geyam

Rachana: Indraganti sreekanth sarma

తేనెలతేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
భావంభాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా
తేనెలతేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
భావంభాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా

సాగరమేఘలా చుట్టుకుని సురగంగా చీరగా మలచుకుని 2
గీతాగానం పాడుకుని 2
మన దేవికి ఇవ్వాలి హారతులు
తేనెలతేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా

గాంగఝటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా 2
గల గల పారె నదులన్నీ 2
ఒక బృందగానమే చేస్తుంటే
తేనెలతేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా

ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలబలం 2
వారందరిని తలుచుకుని 2
మన మానసవిధిని నిలుపుకుని

Comments